అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి

 

వికారాబాద్ నియోజకవర్గం శివారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పట్నం మహెందరెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్,రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్,
మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్, ఎంపీపి చంద్రకళ పాల్గొన్నారు.
రాష్ట్రంలో 27,147 పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకం అమలు చేస్తుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
23 లక్షల మంది విద్యార్థులకు అల్పాహార పథకం ప్రభుత్వం అందిస్తున్నదన్నారు.
వికారాబాద్ జిల్లాలో 4 పాఠశాలల్లో 602 మంది విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభించామని వివరించారు.జిల్లాలో దసరా నుండి 1052 పాఠశాలల్లో 92,000 మంది విద్యార్థులకు సీఎం అల్పాహార పథకం వర్తిస్తుందనీ సమాచార మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు.
గతంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ ప్రక్షాళన చేస్తున్నారన్నారు.
మన ఊరు మనబడి కార్యక్రమంలో వికారాబాద్ జిల్లాలోని 371 పాఠశాలలను 109 కోట్లతో ఆధునికరిస్తున్నామని ఆయన చెప్పారు.
మధ్యాహ్న భోజన పథకం గతంలో 9వ తరగతి వరకు ఉండేదనీ,ఇక నుండి 9,10 తరగతుల విద్యార్థులకు కూడా సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking