దశదినకర్మ కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి పొంగులేటి పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ డిసిసిబి డైరెక్టర్ మల్లిబాబు యాదవ్

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 23 (ప్రజాబలం)
అఖిల భారత యాదవ మహాసభ జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్,కీ. శే చిత్తారు శ్రీహరి,విశ్వనాధ్ ల తండ్రిగారైన చిత్తారు హుస్సేన్ గారు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి దశదినకర్మ, కార్యక్రమాలలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, పాల్గొని కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు వచ్చిన అతిథులకు భోజనా కార్యక్రమా లు స్వయంగా పర్యవేక్షిoచారు ఈ సందర్భంగా మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ మనకు జన్మనిచ్చి ఈ ప్రపంచంలో వేలు చూపి వెన్ను తట్టి జీవిత పాఠాలు నేర్పి ఈ స్థాయికి తీసుకువచ్చిన కన్న తండ్రి ఋణం తీసుకోవాల్సిన బాధ్యత మనిషి గా పుట్టినందుకు ప్రతి ఒక్కరిపై ఉందని, దానిలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మన సాంప్రదాయమని పేర్కొన్నారు.

వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి మేము న్నామంటూ మనోధైర్యం కల్పించారు ఈ కార్యక్రమంలో చిత్తారు ఇందుమతి రాష్ట్ర నీటిపారుదల శాఖ సంస్థ చైర్మన్ మువ్వ విజయబాబు డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని స్వర్ణకుమారి ఖమ్మం మార్కెట్ చైర్మన్ ఎర్రగర్ల హనుమంతరావు, మలీదు వెంకటేశ్వర్లు మలీదు నాగేశ్వరరావు, షేక్ పతే మహమ్మద్ కూరాకులనాగభూషణం పగడాల నాగరాజు కూరాకుల వల్లరాజు జిల్లా ఓబీసీ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, లోడిగ వెంకన్న దుబాకుల శ్రీనివాస్, మేకల నాగేశ్వరరావు బమ్మిడి శ్రీనివాస్, గుమ్మా రోశయ్య బండారి ప్రభాకర్, పొదిలి సతీష్ గంజి సూర్యనారాయణ, కనక బండి విజయలక్ష్మి పల్లెబోయిన శ్రీనివాస్ యాదవ్ హుస్సేన్, పొదిలి తిరుపతిరావు, మొరిమేకల కోటయ్య చేతుల నాగేశ్వరరావు తోడేటి లింగరాజు, కన్నెబోయిన రవి వంశీ సప్పిడి వెంకటేశ్వర్లు వా కదాని శ్రీను చందు మరియు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking