జర్నలిస్ట్ విష్ణు దశదినకర్మలకు హాజరైన ఎమ్మెల్యే కవ్వంపల్లి…. వోడితల ప్రణవ్

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 08

పి.సి.సి.మెంబర్ పత్తి కృష్ణా రెడ్డి సోదరుడు హుజురాబాద్ ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పత్తి విష్ణువర్ధన్ రెడ్డి దశదిన కర్మలను పురస్కరించుకొని కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ. హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ సోమవారం రోజున జమ్మికుంట లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. జర్నలిస్టు పత్తి విష్ణువర్ధన్ రెడ్డి దశదినకర్మలనుపి.సి.సి. మెంబర్ పత్తికృష్ణా రెడ్డి నిర్వహించగా ఇట్టి కార్యక్రమానికి కవ్వంపల్లి సత్యనారాయణ. వోడితల ప్రణవ్ కాంగ్రెస్ నాయకులు కర్యర్తలతో కలిసి విష్ణు వర్ధన్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి అంజలి ఘటించారు.ఈ సందర్భంగా వారు మృతుని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభతిని తెలియ జేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాలు నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కర్యకర్తలు,కార్యక్రమానికి హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking