రాజేంద్ర నగర్ ప్రజాబలం ప్రతినిధి: రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ మణికొండ పరిధిలో ప్రముఖ ప్రక్యాతి గాంచిన పెద్దలు ఎందరో నివాసముంటున్న పంచవటి కాలనీలో ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి పందెన్వాగు పొంగి పొర్లతున్నన్దున కాలనీ వాసులు బయటకు వెళ్ళలేక, వెళ్ళినవారు తిరిగి కాలనీలోకి ప్రవేశించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నెమరు వేసుకుంటూ ఇట్టి పరిస్థితి వస్తుందని గత నెల రోజుల క్రితమే అంచనా వేసుకొని ఆల్ కాలనీ ఫెడరేషన్ అద్యక్షుడు సీతారామ్ దూలిఫాళ్ళ వారి సహచర సభ్యులు మరియు మణికొండలోకల కాలనీ అధ్యక్షులతో కలిసి స్థానికంగా చెందిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజీత్ రెడ్డిని కలువడం జరిగినా లాభం లేని అనుభవం ఎదురైందని స్థానిక ప్రజానీకం కల్లోల పడుతూ వారి అనుభవాలను తెలియ పరచారు. పంచవటి కాలనీ వాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ,మణికొండ మున్సిపల్ ఛైర్మెన్ కస్తూరి నరేందర్ స్థానిక వార్డ్ కౌన్సిలర్ మరియు కౌన్సిల్ వైస్ ఛైర్మెన్ కె.నరేందర్‌రెడ్డి పంచవటి కాలనీ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు.
