లక్షెట్టిపేట మార్చి 15 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వింద్యాశాఖ ప్రతి ష్మాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాలలోని జిల్లా లక్షెట్టిపేట మండలంలోని పాథ్రమిక ఉన్నత పాఠశాల చందారం గ్రామంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు,ట్రైనింగ్ కలెక్టర్ గౌతమి ప్రారంభించారు. గురువారం ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ…సర్కారు బడులలో సకల వసతులతో పాఠశాలలోని మౌనిక వసతులు కాంపౌండ్ వాల్, టాయిలెట్స్,త్రాగునీరు పంప్స్, విద్యుత్,గ్రీన్ బ్లాక్ బోర్డ్స్, విద్యార్థులకు 2 జత్తల దుస్తులు, సుమారు 25 లక్షల రూపాయలతో చందారం పాఠశాలలకు వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ముత్తె సత్తన్న,ఎంపీపీ అన్నం మంగ-చిన్నన్న,నడిపెల్లి టస్ట్ చైర్మన్ నడిపెల్లి విజీత్ రావు,సర్పంచ్ బానవత్ జయంత్,ఎంఈఓ కాసుల రవీందర్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరినాథ్,ఎంపీడీవో ఎంపీవో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.