14వ వార్డు కౌన్సిలర్ చింత సువర్ణ
ఘనంగా తల్లిపాల వారోత్సవం ప్రారంభం
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 02 : తల్లిపాలు,ముర్రుపాలు బిడ్డలకు అమృతంతో సమానమని 14 వ వార్డు కౌన్సిలర్ చింత సువర్ణ పేర్కొన్నారు. శుక్రవారం
మున్సిపాలిటీలోని 14వ వార్డ్ లో శిశు సంక్షేమ,స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…వారం రోజులపాటు తల్లిపాల వారోత్సవాలను కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం చాలా ప్రాముఖ్యత కల్గినదని,తల్లి పాల ప్రాముఖ్యత, తల్లి పాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లి పసుపు రంగులోని చిక్కటి పాలు (ముర్రుపాలు) బిడ్డకు అమృతం లాంటివని వివరించారు.తల్లి పాలు సంపూర్ణ ఆహారమని,వీటిలో బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయనీ,వ్యాధి నిరోధక శక్తి కలుగుతుందని చెప్పారు.బిడ్డకు మొదటి 6 నెలలు తల్లి పాలే సంపూర్ణ ఆహారమన్నారు.6 నెలలు దాటిన తరువాత తల్లి పాలతోపాటు అనుబంధ ఆహారం కూడా ఇస్తారని తెలిపారు.తల్లిపాలు శిశువును న్యుమోనియా, అతిసార వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడతాయని తెలిపారు.పిల్లల మేధస్సును మెరుగుపరచడంలో తల్లి పాలు సహాయ పడతాయన్నారు. ముఖ్యంగా గర్భిణి స్త్రీలకు,బాలింతలకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నామని అంగన్వాడీ టీచర్స్ తెలిపారు.ఈ కార్యక్రమం పి.శంకరమ్మ,ఎస్ శంకరమ్మ,అవునూరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.