కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభించిన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ .
ప్రజాబలం కూకట్పల్లి తెలంగాణలో ప్రారంభమైన నూతన మరియు రెన్యువల్ సభ్యత్వం క్రమంలో భాగంగా కెపిహెచ్బి కాలనీ 5వ ఫేస్ లో గల జనసేన పార్టీ ఆఫీస్ నందు నేడు కూకట్పల్లి నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మొట్టమొదటగా తన సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం కార్యకర్తలకు అండగా నిలబడే సత్కార్యం అని, కార్యకర్తకి ప్రమాదవశాత్తు కష్టము వచ్చినప్పుడు వారి కుటుంబాలను జనసేన పార్టీ ద్వార ఆదుకోవడమే ఈ సభ్యత్వం యొక్క లక్ష్యం అని , జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి భావాలను మరియు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్తే నమోదు కార్యక్రమము జనసేన పార్టీకి మరియు ప్రజలకు ఒక వారధి లాగా ఉంటుందని , ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు చేయించుకోవాలని, జనసేన నాయకులు, వీర మహిళలు ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాముల అవ్వాలని అన్నారు .
ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు.