ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 18 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని జూనియర్ కళాశాల మైదానంలో మినీ స్టేడియం షాపింగ్ కాంప్లెక్స్ నందు షాప్ లను కేటాయించుటకు ఉమ్మడి సర్వే ద్వారా సేకరించిన 35 మంది అర్హుల జాబితాపై అభ్యంతరాలు,ఆక్షేపణలు ఉన్నట్లయితే 3 రోజులలో మున్సిపల్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ… స్థానిక సంస్థల అదనపు పాలనాధికారి మంచిర్యాల ఆదేశం మేరకు లక్షెట్టిపేట జూనియర్ కళాశాల మైదానంలో మినీ స్టేడియం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రదేశంలో దుకాణాలను కోల్పోయిన వారి వివరాలను జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, మున్సిపల్ కమిషనర్ ఉమ్మడి గా సర్వే నిర్వహించి,సేకరించిన వివరాల ప్రకారం అర్హులైన 35 మంది జాబితాను సిద్ధం చేశామన్నారు.ఇట్టి అర్హుల జాబితాను మున్సిపల్ కార్యాలయ నోటిస్ బోర్డ్ పై ఉంచడం జరిగిందన్నారు.అర్హుల జాబితాపై అభ్యంతరాలు,ఆక్షేపణలు ఉన్నట్లయితే 3 రోజులలో మున్సిపల్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరారు.