బిటి రోడ్డు పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 17 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని జరుగుతున్న బిటి రోడ్డు నిర్మాణపు పనులను సోమవారం మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పరిశీలించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ…గాంధీ చౌక్ నుండి ఎంపిడిఓ కార్యాలయం వరకు, సబ్ స్టేషన్ నుండి కస్తూర్బా గాంధీ విద్యాలయం వరకు, అక్స మజీద్ నుండి వెంకటేశ్వర స్వామి గుట్ట వరకు టియుఎఫ్ఐడిసి నిధులతో జరుగుతున్న బిటి రోడ్డు నిర్మాణపు పనులు త్వరగా పూర్తి చేయాలనీ సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. పనుల యొక్క నాణ్యత లోపించకుండా పరిశీలించాలని వర్క్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కి తెలిపారు. అనంతరం పట్టణంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు, పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమం లో అయన వెంట మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking