మన ప్రాంత ప్రజలు అంటే ఆయనకి చిన్నచూపు
డబ్బు సంచులతో గెలవచ్చు అనుకుంటున్నాడు
పాలేరు బిఆర్ఎస్ అభ్యర్థి కందాళ
ఖమ్మం ప్రతినిధి నవంబర్ 19 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మారుతి నగర్ శ్రీరామ్ నగర్ కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణా రాక ముందు గ్రామాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో గమనించండి ప్రజాలరా బి ఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పై దృష్టి సారించింది ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టో అమలు చేయగలిగేది ఒక్క కేసీఆర్ మాత్రమే రైతు రుణమాఫీ ఇప్పటి వరకు ఎనభై శాతం అయ్యింది మిగిలినవి ప్రాసెస్ లో ఉన్నాయి ఎన్నికల అనంతరం నియోజకవర్గం మొత్తం దళిత బందు ఇస్తాం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అట్లాంటి వ్యక్తులు పాలేరు ప్రజలకు అవసరమా ఈ గడ్డ మీద పుట్టిన మీ బిడ్డను కారు గుర్తుపై ఓటేసి నన్ను మరోసారి ఆశీర్వదిం చండి ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్ల ఉమా వేణుగోపాల్ వెంపటి ఉపేందర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
