ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 25 (ప్రజాబలం) బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గురువారం రఘు నాధపాలెం మండలం లోని పలు గ్రామాల్లో పర్యటించి పలు వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.రాములు తండాలో నూతన వధూ వరులు భూక్యా రాజా ను దీవించగా బద్యా తండాలో నూనావత్ మహేష్ – స్వాతి గారి తో పాటు మాలోత్ పవన్ – శైలజ లను ఆశీర్వదించారు. మంగ్య తండాలో గుగులోత్ కృపా జ్యోతి – సుమన్ లను, కోయచలకలో గొర్రె కృష్ణయ్య – రాధమ్మ కుమారుడు సతీష్ – కావేరి లను నామ గారు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ రఘునాధపాలెం మండల అధ్యక్షులు వీరూ నాయక్, ఉప్పల వెంకట రమణ, తండాల పెద్దలు నూనావత్ పెంట్యా, నూనావత్ లకుపతి, దస్రూ, బాణోత్ లాల్ చంద్, బాణోత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.