నంది పూరస్కారాలు అందుకున్న తండ్రి కూతురు ప్రేమతో నాన్న

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

లఘు చిత్రం దర్శకత్వం వహించి నటించిన నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డా. వేణుగోపాలకృష్ణ నంది పురస్కారమందుకున్నారు.ఉత్తమ చిత్రం తో పాటు ఉత్తమ దర్శకత్వం కు గాను డా.వేణుగోపాలకృష్ణ ఈ గౌరవం పొందారు. విభిన్న బావల్ని పలికించి,ఆంగీకం, వాచకం, నాట్యం తో పాటు అద్భుతంగా నటించిన సుహాసిని కి ఉత్తమ నటి నంది అవార్డు లభించింది. ఇద్దరు వైద్య విద్యకు సంబంధించిన వారై ఇద్దరు తండ్రి కూతుళ్లు కావడం విశేషం. డా. వేణుగోపాలకృష్ణ నిజామాబాద్ వైద్య కళాశాలలో.ఎం డి బయోకెమిస్ర్టీ, సుహాసిని. ఎం బి బి ఎస్.మూడవ సంవత్సరం హైదరాబాద్ కామినేని మెడికల్ కాలేజీ లో చదువుతున్నారు. హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్లో నిన్న జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తండ్రి కూతుళ్లు ఇద్దరు నంది పురస్కారాలు అందుకున్నారు ప్రేమతో నాన్న చిత్రనికి గాను.ఈ కార్యక్రమంలో సుహాసిని సంప్రదాయ భరత
నాట్యన్ని ప్రదర్శించారు. ప్రముఖ నిర్మాత, మాజీ.ఎం ఎల్ ఏ. అంబికా కృష్ణ తో పాటు రుద్ర శ్రీనివాస్ మరియు ఇతర సినీ ప్రముఖులు నంది అవార్డులు అందిస్తూ వేణుగోపాలకృష్ణ సుహాసిని లను ప్రశంచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking