మనికొండ ప్రజాబలం ప్రతినిధి: జాతీయ సైన్స్ దినోత్సవం 2023 సందర్భముగా మనికొండ మునిసిపల్ కౌన్సిల్ కే పీ ఆర్ కాలనీలో కల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఇంచార్జీ తిరుపతి రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయుడు రవి కుమార్, ప్రైమరీ స్కూల్ ఇంచార్జీ కుమారి, పీ పీ టీ ఇంచార్జీ గీత వారి ఆధ్వర్యంలో ప్రముఖ భౌతికశాస్త్ర పరిశోధకుడు నోబుల్ బహుమతి గ్రహీత సర్ సీ వీ రామన్ గారి రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న ఈ రోజున జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకొన్నారు ఇందులో విద్యార్థినీ విద్యార్థులు చురుకుగా పాల్గోని వారీ వారి మేథా శక్తులతో అద్భుత చిత్ర విచిత్ర కళా యూనిట్ లను తీర్చి దిద్దారు ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కే. రామకృష్ణా రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బుద్దోల్ శ్రీరాములు, కౌన్సిలర్ ఆలస్యం నవీన్ కుమార్, బీఆర్‌ఎస్వీ నాయకుడు శ్రావణ్, సీనియర్ నాయకులు అందె లక్ష్మణ్ రావు, శ్రీకాంత్, రాఘవేంద్ర, లక్ష్మయ్య, గంగాధర్, సందీప్, పుల్లారావు, దిలీప్, కిరణ్ మహిళా నాయకురాలు లక్స్మిశ్రి ఆదిగా పాల్గొన్నారు.
