మేకల మల్లి బాబు యాదవ్ చిత్తారు సింహాద్రి యాదవ్
జూబ్లీహిల్స్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న ఖమ్మం జిల్లా అఖిలభారత యాదవ మహాసభ నాయకులు
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 17 (ప్రజాబలం) నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి మెజారిటీతో గెలవడం ఖాయమని ఖమ్మం జిల్లా అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ నాయకులు ఖమ్మం నుండి దాదాపు పది వాహనాలలో తరలి వెళ్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహా సభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ నేటి నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన అభిమానులు ఓటర్లను, అశేష జనవాహిని ని చూస్తే గెలుపు ఇప్పుడే వచ్చినట్లుగా ఉన్నదని, వారి నాన్నగారైన శ్రీశైలం గారు ఈ ప్రాంతంలో వ్యాపార పరంగానే కాకుండా ప్రజలందరితో మమేకమై వారి సాధక బాధలలో పాలుపంచుకొని మంచి సంబంధాలు కలిగి ఉండడం, అంతేకాకుండా నవ యువ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల హృదయాలలో నుంచి పోయిన నవీన్ యాదవ్ గెలుపు ఎవరు ఆపలేరని తెలిపారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిందని, ఇన్నాళ్లు లేని కపట నాటకంతో బీసీ రిజర్వేషన్లు చేయాలని బీసీలకు హక్కు కల్పించాలని మోసపు మాటలతో అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. 10 సంవత్సరాల పాటు పరిపాలించిన బి ఆర్ఎస్ వారికి బీసీ రిజర్వేషన్లు గుర్తుకు రాలేదని, గత ప్రభుత్వం చేసిన మోసాలు, మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను నిలువునా దోచేసిన చరిత్ర బిఅర్ఎస్ కు ఉన్నదని, మళ్లీ వాళ్లు ఎలా ఓట్లు అడుగుతారని ఆరోపించారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ముఖ్యంగా 200 యూనిట్లు లోపు ఉన్నవారికి ఫ్రీ కరెంట్ పథకం, మహిళా సోదరీమణులకు ఉచిత బస్సు సౌకర్యం, ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న కుటుంబాలకు రేషన్ కార్డులు మరియు నిరుపేదలైన లబ్ధిదారులకు రాజకీయాలు వర్గాలు అనే తేడా లేకుండా ఇండ్లకు ఐదు లక్షల రూపాయలను కూడా నేరుగా వారి ఖాతాలోకి జమ అయ్యేటట్లుగా, అవినీతికి ఆస్కారం లేకుండా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని, నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా బీసీ ఎస్సీ ఎస్టీల పక్షపాతం అని మరొకసారి రుజువైందని మల్లి బాబు యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలోపుచ్చకాయల కృష్ణ, మల్లె బోయిన శ్రీనివాస్, డేగల ఉపేందర్, జోనబోయిన పాపయ్య పుట్ట ఉపేందర్, చింతల పెద్ద వెంకయ్య, మేకల లక్ష్మీనారాయణ సత్తి వెంకన్న మంద నాగేశ్వరావు డేగల రాజు వెంకటరెడ్డి శివ సత్తి వీరబాబు మరియు తదితరులు పాల్గొన్నారు
