సింగూర్ డ్యాం భద్రత పై (ఎన్ డి ఎస్ ఏ) ఆందోళన

 

👉 తక్షణమే ఎలాంటి ఆలస్యం లేకుండా మరమ్మతులు చేపట్టాలని సూచించింది

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి ఆగస్టు 14 (ప్రజాబలం )సంగారెడ్డి జిల్లా : ఉమ్మడి మెదక్ జిల్లాలోని అతి పెద్ద ప్రాజెక్టు అయిన, పుల్కల్ మండల పరిధిలో గల సింగూరు జలాశయం ప్రమాదంలో ఉందని, జాతీయ ఆనకట్ట భద్రత సంస్థ (ఎన్ డి ఎస్ ఏ) హెచ్చరించింది, ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రధాన ఇంజనీర్ (ఈ ఎన్ సి )కు లేఖ రాసింది, ఎలాంటి ఆలస్యం చేయకుండా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సూచించింది, (ఎన్ డి ఎస్ ఏ ) నివేదిక ప్రకారం, రిజర్వాయర్ నీటి నిల్వ ప్రాంతంలో పలుచోట్ల మట్టికట్ట రివిట్మెంట్ దెబ్బతిన్నాయని, అదేవిధంగా పారాపేట్ గోడ, మరియు మట్టికట్ట పై భాగంలో, పగుళ్లు గుర్తించబడ్డాయి, ఈ లోపాలు ఇలాగే కొనసాగితే, జలాశయం భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, అధికారులు స్పష్టం చేశారు, సింగూర్ డ్యాం కింద నిజాంసాగర్ మరియు మంజీరా జలాశయాలు ఉన్నందున, సింగూరు ప్రాజెక్టు రక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, (ఎన్ డి ఎస్ ఎ) సదరన్ రీజియన్ డైరెక్టర్ పేర్కొన్నారు, డ్యాం పరిరక్షణకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని, (ఈ ఎస్ సి కి ) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు, ఇదిలా ఉంటే సింగూరు జలాశయం నుండి, హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతుందని, కాబట్టి ఈ మరమ్మత్తుల విషయంలో ప్రభుత్వమే కాకుండా, ప్రజలు కూడా అప్రమత్తంగాఉండాలనినిపుణులు సూచిస్తున్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking