ఉప్పల్ మే 5 (ప్రజా బలం ప్రతినిధి );ఉప్పల్ మునిసిపాలిటి పరిధి లోని చిల్కా నగర్ డివిజన్ లో నూతన ‘కంటి వెలుగు’ కేంద్రాన్ని స్థానిక కార్పోరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ‘ఆరోగ్య తెలంగాణ’ అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నదని, వైద్య, ఆరోగ్య రంగంలో దేశానికే ‘తెలంగాణ మోడల్’ ఆదర్శంగా నిలిచిందన్నారు. కంటి వెలుగు’ను అందరూ ఉపయోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ పిహెచ్ సీ నుంచి డాక్టర్ సౌందర్యలత, హెల్త్ సూపర్ వైజర్ బోగ ప్రకాష్, సిగ్మతుల్లా, గొంగడాయి, కరుణ, కంటి వెలుగు సూపర్ వైజర్ ప్రమీల, డాక్టర్ అనిత, 2వ ఏఎన్ఎం అండాలు, అఫ్తాల్మజిస్ట్ గ్రేసీ, డీఈవో భారత పారిజాత, ఆశా భారతి ఇతర వైద్యారోగ్య సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.