చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నూకలు రమేష్

ప్రజా బలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 18 : భారత్ జోడో యాత్ర కు అనుసంధానంగా మందమర్రి పట్టణ కేంద్రం లో గడప గడపకు కాంగ్రెస్ పేరుతో జరిగిన సభలో చెన్నూర్ నియోజకవర్గ అభ్యర్థిగా స్థానిక నాయకుడు పిసిసి మెంబర్ నూకల రమేష్ కాంగ్రెస్ నుండి చెన్నూర్ నియోజక వర్గ అభ్యర్థిగా పోటీలో ఉంటారని ఏఐసీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ బుధవారం ప్రకటించారు.ఈ సందర్బంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ…చెన్నూర్ నియోజక వర్గానికి స్థానిక నేతలు ఎమ్మెల్యే లుగా లేనందున ప్రజలకు అందుబాటులో ఉండక, కేవలం ఇక్కడి వనరులు దోచుకొని పోడానికే వస్తున్నారు,ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు, స్థానికుడు విద్యావంతుడు నూకల రమేష్ ని ఈ సారి ఎన్నికల్లో గెలిపియ్యాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, టిపిసిసి ప్రధాన కార్యదర్శులు చిట్ల సత్యనారాయణ,రఘునాత్ రెడ్డి, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి ఎండి ముజాహిద్,బ్లాక్ ప్రెసిడెంట్ గోపతి రాజన్న,నాయకులు కాంపెల్లి సమ్మయ్య, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత, మందమర్రి మండల అధ్యక్షులు కడారి జీవన్ కుమార్,ఎస్ సి సేల్ పట్టణ అధ్యక్షుడు నెర్వేట్ల శ్రీనివాస్, మహిళా ప్రెసిడెంట్ గడ్డం రజిని, యువజన నాయకులు రంజిత్ సీనియర్ నాయకులు,కోటపల్లి, చెన్నూర్, బీమారం జైపూర్ మండలాల అధ్యక్షులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking