దేశంలో ప్రస్తుతం అదానీపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంటే.. ప్రధాని మోదీ నోట నుంచి ఒక్క మాట కూడా రాలేదు.
హైదరాబాద్, ఫిబ్రవరి 12 : దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఎంతో అవకాశం ఉందని.. అదానీ, అంబానీలకు కాదు రైతుల పిల్లలకు అప్పులిస్తే అద్భుతాలు సృష్టిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం, పాలమూరుపై ఎన్ని కుట్రలు చేశారో ఈటల రాజేందర్‌కు తెలియదా? అని సూటిగా ప్రశ్నించిన .. కుట్రలన్నీ ఛేదించి అనేక ప్రాజెక్టులు సాధించుకొని సాగులో పంజాబ్‌ను తలదన్నే పరిస్థితికి ఎదిగామని హర్షం వ్యక్తం చేశారు.అదానీ, అంబానీలకు కాదు.. రైతుల పిల్లలకు అప్పులిస్తే అద్భుతాలు సృష్టిస్తారు'”1871నుంచి ఇప్పటి వరకు 140 ఏళ్లలో జనాభా గణన ఏ ఒక్కసారి కూడా ఆగలేదు. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోనూ జనాభా గణన ఆగలేదు. మరి ఇప్పుడు మోదీ ప్రభుత్వం జనాభా గణన ఎందుకు చేపట్టడం లేద”ని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించిన ఆయన.. జనాభా లెక్కలు జరిగితే బీజేపీ బండారం బయటపడుతుందని భయపడుతోందని ఆరోపించారు. జనాభా గణన చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీలు అడుగుతున్నారని తెలిపారు.
కాళేశ్వరం, పాలమూరుపై ఎన్ని కుట్రలు చేశారో ఈటల రాజేందర్‌కు తెలియదా అని పేర్కొన్నారు
. కుట్రలన్నీ ఛేదించి అనేక ప్రాజెక్టులు సాధించుకున్నామని తెలిపారు. ఇప్పుడు సాగులో పంజాబ్‌ను తలదన్నే పరిస్థితికి ఎదిగామని తెలిపారు. నీళ్ల లెక్కలు తేల్చేందుకు కాంగ్రెస్ వల్ల కాదు.. బీజేపీ వల్ల కాదు.. అందుకే బీఆర్‌ఎస్‌ను తీసుకొచ్చామని ప్రకటించారు తెలంగాణ సహా దేశంలోని ప్రతి ఎకరానికి నీళ్లు రావాలని కోరుకునేవాడినని అని అన్నారు కేంద్రంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని.. కొత్త జల విధానం తీసుకొస్తామని ప్రకటించారు. ఐదారేళ్లలో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ తరహాలో తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
దేశంలో ప్రస్తుతం అదానీపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంటే.. ప్రధాని మోదీ నోట నుంచి ఒక్క మాట కూడా రాలేదని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించిన ఆయన.. హిండెన్‌బర్గ్ లేవనెత్తిన అంశంపై ప్రధాని వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. 60, 40 ఏళ్ల కిందటి నెహ్రూ, ఇందిరాగాంధీల పాలనను విమర్శిస్తున్న మోదీ.. అదానీ విషయం చెప్పకుండా ఇతర విషయాలు పార్లమెంట్‌లో ప్రసంగిస్తున్నారని మండిపడ్డారు.తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. .. పార్లమెంట్‌లో మోదీ ప్రసంగంపై స్పందించారు. అదానీ అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంటే.. మోదీ ప్రసంగంలో అదానీ ప్రస్తావనే తీసుకురాలేదని మండిపడ్డారు. హిండెన్‌బర్గ్ లేవనెత్తిన అంశంపై ప్రధాని వివరణ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంపై ద ఎకానమిస్ట్ పత్రికలో కథనం వచ్చిందని పేర్కొన్నారు ఆయన.. అదానీ అంశంపై దిల్లీలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాయని తెలిపారు.
ఈ క్రమంలోనే 60, 40 ఏళ్ల కిందటి నెహ్రూ, ఇందిరాగాంధీల పాలనను విమర్శిస్తోన్న మోదీ.. అదానీ విషయం చెప్పకుండా సంబంధం లేని విషయాలు పార్లమెంట్‌లో ప్రసంగించారని దుయ్యబట్టారు. దేశ ఆర్థిక దుస్థితిపై పార్లమెంటులో చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడిన ఆయన.. అసలు అభివృద్ధికి తలసరి ఆదాయం సూచనగా పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో భారత్ ర్యాంకు 139గా ఉందని అన్నారు బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక కంటే మన తలసరి ఆదాయం తక్కువుందని విమర్శించారు. మోదీ చుట్టూ ఉన్న నేతలు అనవసరంగా ఆయన్ను పొగుడుతున్నారని.. అనవసర పొగడ్తలు ప్రధాని మోదీకి మంచి చేయవని హితవు పలికారు.