26 న పర్యావరణం పై పాఠశాల విద్యార్థులకు ” చిత్ర లేఖనం “పోటీలు

హైదరాబాద్ ఫిబ్రవరి 21 ; హైదరాబాద్ ఫుబ్రవరి 21 ;ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈనెల 26 వ తేదీన పర్యావరణం పై పాఠశాల విద్యార్థుల నిర్వహిస్తున్న ” చిత్ర లేఖనం ” కార్యక్రమానికి అతిధిగా హాజరు కావాలంటూ జలమండలి డిప్యుటీ కన్సర్వేటర్ అఫ్ ఫారెస్ట్ అధికారి కొండా మోహన్ ను కౌన్సిల్ నాయకులు మంగళవారం ఆహ్వానించారు. పర్యావరణ భద్రత ఇవాళ అత్యంత అవసరమైన అంశమని పేర్కొన్నారు. ఒక సంస్థగా కౌన్సిల్ ముందుకు రావడం హర్షనీయమన్నారు. కొండా మోహన్ తోపాటు జలమండలి భూ గర్భ నీటి అధికారి సత్యనారాయణ తదితరులకు కౌన్సిల్ నాయకులు క్యాలెండర్ అందజేశారు. కౌన్సిల్ గౌరవాధ్యక్షులు ఉప్పల వెంకటేష్ గుప్త, వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య, కార్యక్రమ కో ఆర్డినేటర్ నీలం శ్రీనివాస్ యాదవ్, సభ్యులు టీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking