శివహాం ఆర్ట్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మార్చ్ నెల 8 శుక్ర, 9 శని, 10 ఆదివారం రోజులలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు
రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 05 మార్చ్ 2024: శివహాం ఆర్ట్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మార్చ్ నెల 8 శుక్ర, 9 శని, 10 ఆదివారం రోజులలో శ్రీరామ్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ హల్ నందు ఆర్ట్ ఎక్స్భిషన్ సందర్భంగా 10న ఉదయం 10 నుండి మధ్యానం 1 వరకు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడ మైనదని తెలుపుతూ ఈ సందర్భంగా రావుస్ ఈఎన్టీ జీవీస్ రావు, శ్రీరామ్ క్లినిక్స్ ఎముకల డాక్టర్ శ్రీనివాస్ బోగ, ఏ ఎం క్యూర్ హాస్పిటల్ జనరల్ మరియు మధు మేహా డాక్టర్ శ్రీనివాస్ ఆదిత్యా, గైనిక్ డాక్టర్ దివ్యా బట్చూ, అక్షయ డెంటల్ డాక్టర్ శ్రీకాంత్, మెడ్కేర్ హాస్పిటల్ వారి కార్డియాలజీస్ట్, మధు మేహా తదితర రక్త పరీక్షలతో పాటు ఫస్ట్ కేర్ ఫార్మసీ వారు బీ.పీ, ఎత్తు, బరువులతో పాటు ప్రత్యేకత కలిగిన బీ.ఎమ్.ఐ పరికరంతో ఉబకాయం, క్రొవ్వు అనాలిసిస్ పరీక్షలు చేస్తారని ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించు కోవాలని హెల్త్ క్యాంప్ బృందం ఆర్గనైజర్ బి. శివరామ కృష్ణ తెలియ పరచినారు.