సంగారెడ్డి జనవరి 30 ప్రజ బలం ప్రతినిధి:
*మెదక్ జిల్లా చేగుంట మండల్ ప్రజా పరిషత్ కార్యాలయం లో ఈరోజు జరిగిన మండల సర్వసభ్య సమావేశం లో పాల్గొనడం జరిగింది. అనంతరం చందాయిపేట గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ కి మండలం లోని సర్పంచ్ ల పదవికాలం 2019 నుండి 31/01/2024 ముగియడంతో సర్పంచ్ లందరికి సన్మానం చేయడం జరిగింది. భవిష్యత్ లో ఉన్నత పదవులు పొందాలని వారికీ శుభాకాంక్షలు తెలియజేశాము ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆనందమేరి, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, డిప్యుటీ తహసిల్దార్ స్వప్న, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ సెక్రెటరీ లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.