ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ సందర్భంగా ములుగు ప్రధానాస్పత్రి నుండి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మరియు జిల్లా ప్రధాన ఆస్పత్రి సిబ్బందితో కలిసి ర్యాలీ
వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయము_ ములుగు.
ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా తేదీ: 24-03-2025 ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ సందర్భంగా ములుగు ప్రధానాస్పత్రి నుండి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మరియు జిల్లా ప్రధాన ఆస్పత్రి సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం, క్షయ వ్యాధి అంతం_ మన అందరి పంతం, క్షయరోగాన్ని ద్వేషించు_ రోగిని కాదు, క్షయ వ్యాధిని క్షమించడం తథ్యం క్షయరోగిని బ్రతికించడం_ మన ధర్మం, క్షయ వ్యాధి వ్యక్తిగత సమస్య కాదని, అది సామాజిక సమస్య అని, క్షయ వ్యాధికి సమగ్రమైన చికిత్స డాట్స్ అని లేనిచో అది ముదిరిన వ్యక్తికి పరాకాష్ట అని, నినాదాలతో ర్యాలీ ద్వారా ప్రజలను వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. అటు తరువాత ములుగు ప్రధాన ఆస్పత్రి మీటింగ్ హాల్లో ఏర్పాటుచేసిన మీటింగ్ ను ఉద్దేశించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. గోపాలరావు మాట్లాడుతూ, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకే ఈ ర్యాలీ ఉద్దేశమని, గ్రామస్థాయిలో ప్రజలకు క్షయ వ్యాధి వ్యాప్తి, వ్యాధి నిర్ధారణ ,వ్యాధికి చికిత్స పట్ల అవగాహన కల్పించాలని, గ్రామాలలో గ్రామసభలు, విలేజ్ న్యూట్రిషన్ డే కమిటీ మీటింగ్లో ,శానిటేషన్ కమిటీ మీటింగ్లో ,విలేజ్ జాస్ మీటింగులు లలో మొదలు క్షయ వ్యాధి పట్ల అవగాహన కల్పించి, అటు తరువాతనే సభలను నిర్వహిస్తే గ్రామ ప్రజలకు టిబి వ్యాధి పట్ల అవగాహన ఏర్పడుతుందని వివరించారు. అప్పుడే” అవును_ క్షయ యవ్యాధి అంతం చేయవచ్చు, కట్టుబడి పెట్టుబడి అందించండి” అనే ఈ సంవత్సరం తీమును మును సాకారం చేయవచ్చునని తెలిపారు . క్షయ వ్యాధి కలిగిన వ్యక్తి ఒక సంవత్సరానికి 10 మందికి క్షయ వ్యాధినీ వ్యాప్తి చేయగలడని, గాలి ద్వారా వ్యాపిస్తుందని, జ్వరము ,చాతి నొప్పితో కూడిన దగ్గు, తేమడ లో రక్తం పడటం, బరువు తగ్గడం, మొదలగు లక్షణాలు ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ఉచితంగా తెమడ పరీక్షలు, మందులను పొందవచ్చునని తెలిపారు. తొందరగా వ్యాధి నిర్ధారణ మరియు చికిత్సను అందజేసినట్లయితే వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చునని , డి ఎం ఎం హెచ్ ఓ డాక్టర్. గోపాలరావు తెలిపారు. క్షయ వ్యాధి ఉన్న రోగి దగ్గినప్పుడు రుమాళ్లను గాని, చేతిని గాని అడ్డంగా పెట్టుకోవాలని, ప్రోగ తాగడం ,ఆల్కహాలను సేవించడం లాంటివి కి దూరంగా ఉండాలని తెలిపారు. తర్వాత ములుగు డిస్టిక్ హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ .జగదీష్ మాట్లాడుతూ, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మరియు ములుగు ప్రధాన ఆస్పత్రి డాక్టర్లు సమన్వయంతో పనిచేయాలని, అప్పుడే ఈ జిల్లాలో క్షయ వ్యాధిని అరికట్టవచ్చునని తెలిపారు. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్. చంద్రకాంత్ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, పర్యవేక్షకులు ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు మరియు జిల్లా ప్రధాన ఆస్పత్రి నిపుణులు టీం వర్క్ స్ఫూర్తితో పని చేయాలని ,అప్పుడే క్షయ వ్యాధిని నిర్మూలించవచ్చునని తెలుపుతూ, క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తి వివరాలను , నిక్షయ్ పోర్టల్ నమోదు చేయాలని, అప్పుడే వారికి పోషకాహార నిమిత్తము వెయ్యి రూపాయలను ప్రభుత్వముచే అందజేయబడుతుంది తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ప్రధాన ఆస్పత్రి ఛాతి వైద్య నిపుణురాలు డాక్టర్. రాధిక, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్. అనిల్, జనరల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ .ఎం శ్రవణ్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ .ప్రేమ్ సింగ్, రాయినిగూడెం డాక్టర్ ప్రసాద్ ,డెమో సంపత్ ,అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ దుర్గారావు, సామాజిక హెల్త్ ఆఫీసర్ పూర్ణ సంపత్ రావు, ప్రోగ్రాం సూపర్వైజర్స్ సురేష్ బాబు, వెంకట్ రెడ్డి, క్షయ వ్యాధి ప్రోగ్రాం కోఆర్డినేటర్ పుల్లూరి సమ్మయ్య, రాజు, రమేష్, చంద్రమౌళి సూపర్వైజర్స్ దేవేందర్ ,నిర్మల మేరీ, రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య కార్యకర్తలు మరియు వెంకటాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర కార్యకర్తలు పాల్గొన్నారు.