వేములవాడ దేవస్థానంలో ఆన్ లైన్ సేవలు

 

రాజన్న సిరిసిల్ల జిల్లా , జనవరి -21 (ప్రజాబలం)
వేములవాడ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్…
ఇంతకీ గుడ్ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా? దక్షిణ కాశీగా పేరుగాంచిన (Vemulawada Sri Rajarajeshwara Swamy Devasthanam) వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ఆన్‌లైన్ సేవలను ఆలయ అధికారులు ప్రారంభించారు. https://vemulawadatemple.telangana.gov.in, https://play.google.com/store/apps/details?id=com.tfolio.telangana.gov&pcampaignid=web_share వెబ్‌సైట్‌ను భక్తుల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
ఆన్‌లైన్ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న ఆలయ కార్యనిర్వహణాధికారి తెలియజేశారు.
రాజన్న ఆలయంతో (Rajanna Temple) పాటు అనుబంధ దేవాలయాలైన, బద్ది పోచమ్మ, భీమేశ్వరాలయంతో పాటు అనుబంధ దేవాలయాల సమగ్ర సమాచారం, పూజల వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరచి ఉన్నాయి.
ఇకనుండి ఎవరైనా దేవాలయ రూమ్ లు (ధర్మశాలలు) కావాలనుకునేవారు సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ లో ఈ టికెటింగ్ పద్ధతిన తీసుకొనగలరు, , అలాగే MEE SEVA application , MEE SEVA, తదితర మాధ్యమాల ద్వారా ఆన్లైన్ బుకింగ్ చేసుకొనవచ్చును.

Leave A Reply

Your email address will not be published.

Breaking