రాజ్య సభ సబ్యులు బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు ఆర్. కృష్ణయ్య పిలుపు
హైదరాబాద్ జూలై 28 ();బిసి జనాబాలో సమిచిత స్థానం కలిగి ఉన్న పద్మశాలీలు రాజకీయంగా ముందుకు రావాలని రాజ్య సభ సబ్యులు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు ఆర్. కృష్ణయ్య పిలుపు నిచ్చారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు, రాజకీయాల పై బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం నేతృత్వం లో పి హెచ్ టి షాపింగ్ మాల్ కు చెందినమార్కెటింగ్ పార్టనర్స్ వివిధ పద్మశాలి సంఘాలకు చెందిన నేతలు బిసి భవన్ లో ఆర్. కృష్ణయ్యను కలిసి భవిషత్ రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బిసిలపట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్షం వహిస్తున్నాయని అన్నారు.బిసిల జనాబాకు తగిన బర్జేట్ ను కేటాయించక పోవడం వళ్ళ బిసిల అభివృద్ధి కుంటుబడి పోయిందన్నారు.అంతే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు బిసిలను జండాలు మోసి జై కొట్టే కూలిలుగా చూస్తున్నారు తప్ప రాజకీయంగా ఎదుగకుండా అనిచివేస్తున్నారని విమర్శించారు.బిసి ల జనాబా ప్రకారం అసెంబ్లీ,పార్లమెంట్ లలో 55 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.అందుకు బిసిలందరూ ఏకత్రాటిపైకి వచ్చిరాజకీయ పార్టీలపై వత్తిడి తేవాలన్నారు.కృష్ణయ్య ను కలిసిన వారిలో బువనగిరి పద్మశాలి సంఘం తీరందాసు ధనుంజయ,పోచం పల్లి మాజీ సర్పంచ్ గడ్డం వెంకటేశం,ఎస్బీఐ రిటైర్డ్ ఏజిఎం వనం నరసింహ, కొండల రావు తదితరులు ఉన్నారు.
Prev Post
Next Post