టి పి సి సి కార్యదర్శి రాం రెడ్డిగోపాల్ రెడ్డి డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి జులై 19 (ప్రజాబలం) కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో రైతు రుణమాఫీ సందర్భంగా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ, ఊరేగింపు సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాం రెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక లాంటివాడని, రైతు పంట పండించకపోతే ఎంత ఆస్తి ఉన్నా లాభం లేదని, మనందరకు అన్నం పెట్టే రైతు కష్టాలలో ఉండకూడదని, రైతు కన్నీరు పెట్టకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టిందని, అదేవిధంగా భవిష్యత్తులో కౌలు రైతులకు, రైతు కూలీలకు సాయం చేయబోతుందని, వ్యవసాయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన ఏడు లక్షల కోట్లు రూపాయలు అప్పుతో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోయినప్పటికీ, సొంతంగా నిధులు సమకూర్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కేవలం లక్ష రూపాయలు రుణమాఫీ ప్రకటించినప్పటికీ, నెరవేర్చలేకపోయిందని, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఎనిమిది నెలలు అయినప్పటికీ ఇచ్చిన మాటకు 2 లక్షల రైతుల రుణమాఫీ చేయడం జరిగిందని, తెలిపారు. ఇలాంటి ప్రభుత్వమే రైతుకు కావాలని, పాల్గొన్న రైతులంతా సంబరాలతో ముక్తకంఠంతో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, దమ్మాలపాటి సత్యనారాయణ గుజ్జర్లపూడి రాంబాబు, ఎంపీపీ బానోత్ సునీత, ఎంపీటీసీలు నల్ల మోతు లక్ష్మయ్య, గబ్రు నాయక్, సునీత,ఎమ్మార్వో సుధాకర్, ఏవో తారాదేవి, ఏఈఓ మున్ని, సీఈవో ముత్తయ్య,నాగయ్య, షేక్ ఫతే మహమ్మద్, బానోతు నరసింహ నాయక్, మేకపోతుల మహేష్, ధరావత్ అనురాధ, చల్ల మల్లయ్య, దేవండ్ల రామకృష్ణ, ఇమ్మడి రామనాథం, కొమ్మినేని శ్రీను విట్ట శ్రీను, మాలోత్ బావ్ సింగ్, గుగులోతు చింటూ, అజ్మీర రాందాస్, కోలా వెంకటేశ్వర్లు బండి లక్ష్మీ నర్సు, డేరంగుల తిరపయ్య, బద్దల శేఖర్, దుద్దుకూరి నాగేశ్వరరావు జలగం శ్రీను దొడ్డ వేణు, జక్కంపూడి వెంకటేశ్వర్లు, రబ్బానీ పాషా, ధరావతులాలు, శీలం పుల్లయ్య బండి ఉపేందర్, మేకల లక్ష్మీనారాయణ, పాటిబండ్ల ప్రసాదు తదితరులు పాల్గొన్నారు