వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 10 : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఎన్.టి.ఆర్.నగర్ లో మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాప్తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…గత కొన్ని రోజులుగా నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు.జిల్లాలో అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రక్షణ చర్యలు చేపడుతుందని, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని,ప్రజలు భయాందోళన చెందవద్దని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ప్రజల సహాయార్థం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 08736-250501 ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు అత్యవసర సేవల కొరకు సంప్రదించవచ్చని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీర ప్రాంతాన్ని సందర్శించి నీటి ప్రవాహ పరిస్థితిని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking