డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 28 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ప్రజల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ ప్రతి పేదోడి కష్టంలో అండగా నిలుస్తూ, మంచి మనసుతో వారి కష్టాలను తీరుస్తూ నిజమైన ప్రజానాయకుడిగా ప్రజల మనసును గెలిచిన జనహృదయనేతగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ పతే మహమ్మద్, మత్స్య శాఖ సొసైటీ అధ్యక్షులు మేకల మల్లికార్జున రావు, గొర్రెల సంఘం అధ్యక్షులు ముత్తబోయిన రామ్మూర్తి, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాడిబండ్ల ప్రసాద్, ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్య నాగేంద్రబాబు, మాజీ సర్పంచ్ బానోత్ నరసింహ నాయక్, వార్డు మెంబర్లు బానోత్ లక్ష్మ, తొండల ముత్తయ్య, ధరావత హరిచంద్ర, బండి లక్ష్మీ నర్సు, బండి ఉపేందర్, దొడ్డ వేణు జలగం శ్రీను, బోడ శ్రీను, రామచంద్రయ్య, బండి నరసింహారావు సత్తి,వీరబాబు, భానోత్ వీరన్న ఈర్ల ఉపేందర్, ఎస్ కే శంషుద్దీన్, బండి నరసింహారావు చల్ల నాగేశ్వరరావు చల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు