ప్రజా సమస్యలను వెలికితీస్తు ప్రజాబలం మరింత ముందుకు వెళ్లాలి.

.

ప్రజాబలం కాశిబుగ్గ ఫిబ్రవరి 9:

ప్రజ ఆదరణ వార్తలు అందిస్తూ ప్రజలకు చేరువలోకి వస్తున్న ప్రజాబలం దినపత్రిక మరింత ఆదరణ చెందాలని గీసుకొండ మండల ఎంపీడీవో ఏ వీరేశం, జాతీయ ఆదర్శ గ్రామం గంగాదేవి పల్లె గ్రామ సర్పంచి గోన మల్లారెడ్డి అన్నారు. ప్రజాబలం రిపోర్టర్ హరీష్ ఆధ్వర్యంలో 2023 ప్రజాబలం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ను గీసుకొండ లో వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల ఆవిష్కరణలో ప్రజాబలం పత్రిక ముందు వరుసలో ఉంటుందని పాఠకులకు నచ్చే విధంగా పత్రిక కొనసాగుతూ ప్రముఖ పత్రికలకు దీటుగా నడుస్తుందని అన్నారు. ఇలాగే ప్రజా సమస్యల ఆవిష్కరణలో మరింత చురుకుగా వార్తలను సేకరిస్తూ అగ్ర పత్రిక స్థానాలకు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ సనవజ్, ఏ ఈ రవీందర్, నేతాజీ సర్వీస్ టీం నల్ల సుధాకర్, మగసాని శంకర్, నయాబ్ తహసిల్దార్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking