ఆర్థిక కార్యకలాపాలను ప్రణాళికబద్దంగా చేయండి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 24 : ఆర్థిక కార్యకలాపాలను ప్రణాళికబద్దంగా చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, ఎస్.సి. కార్పొరేషన్ ఈ.డి. దుర్గాప్రసాద్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ.పురుషోత్తం లతో కలిసి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూపొందించి గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థిక కార్యకలాపాలను ప్రణాళికబద్దంగా చేయాలని తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని,తెలివిగా నడుచుకోవాలని, బాధ్యతాయుతంగా అప్పు చేయాలని, సమయానికి తిరిగి చెల్లించి మంచి క్రెడిట్ స్కోర్ కొనసాగించాలని తెలిపారు. వచ్చే ఆదాయంలో నెలసరి బడ్జెట్ను ప్లాన్ చేసుకొని పొదుపు చేయాలని,మీ ముఖ్య అవసరాలను సరిగ్గా గుర్తించాలని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని, పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని,భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించి ఖర్చు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking