భీమారంలో గుడుంబా స్థావరంపై పోలీసుల దాడి

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 13 చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం గ్రామ శివారులో ఆర్కేపల్లి దారిలో గుడుంబా కాస్తున్నట్టు నమ్మదగిన సమాచారం మేరకు గురువారం ఎక్సైజ్ అధికారులతో కలిసి దాడి చేసినట్లు భీమారం ఎస్సై శ్వేత తెలిపారు. ఆ ప్రాంతంలో రెండు లీటర్ల గుడుంబా, సుమారు 70 లీటర్ల బెల్లం పానకం, గుడుంబా తయారీకి సంబంధించిన ముడి సరుకు లభించినట్లు ఆమే తెలిపారు. ఈ దాడిలో కానిస్టేబుల్ సత్తిరెడ్డి, అశోక్, నిహల్, రాజకుమార్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ రాజేంద్రప్రసాద్, ప్రసాద్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking