ఖమ్మం రూరల్ లో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన

 

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 6 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా పెద్దతండాలో మృతి చెందిన ఉర్సు శ్రీను మృతదేహాన్ని నాయుడుపేట లో మృతి చెందిన పలసల నర్సమ్మ మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో పర్యటించి పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఆర్ధిక సాయాలను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజ్మీర అశోక్ నాయక్, బానోత్ భాస్కర్, బానోత్ కిషోర్, బానోత్ హరి, ధరావత్ నారాయణ, యశోదమ్మ, మల్లయ్య, జగదీష్, సంగయ్య, నరేష్, బానోత్ దివ్య, బానోత్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking