ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 23 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరుకాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పాలేరు నియోజక వర్గంలో శనివారం పర్యటించనున్నారు ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా నియోజక వర్గంలోని ఖమ్మం రూరల్ తిరుమలాయపాలెం, కూసుమంచి నేలకొండపల్లి మండలాల్లో జరిగే పలు వివాహాది శుభ కార్యక్రమాలు దైవ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. కావున నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులుకార్యకర్తలు అభిమానులందరూ అధిక సంఖ్యలో హాజరై ప్రసాద్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.