నేడు పాలేరులో పొంగులేటి పర్యటన

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 30 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మెన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాలేరు నియోజకవర్గంలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా కూసుమంచి మండలం లోని నాయకన్ గూడెం, మందడి నర్సయ్య గూడెం జక్కేపల్లి, గోరిలాపాడుతండా, జుజ్జులరావు పేట, పాలేరు, ఎర్రగడ్డ తండా, క్రిష్టాపురం, చేగొమ్మ గ్రామాలను, ఖమ్మం రూరల్ మండలంలోని కామంచికల్, జానాబాద్ తండా, మద్దివారి గూడెం తదితర గ్రామాలను సందర్శిస్తారన్నారు. ఆయా గ్రామాలను సందర్శించి పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదారుస్తారని తెలిపారు. కావున నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking