పొన్నం ప్రభాకర్ పరామర్శ

జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి జులై 2 కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిసిసి స్టేట్ మేంబర్ పత్తి కృష్ణారెడ్డి సోదరుడు పాత్రికేయుడు పత్తి విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో చనిపోవడం జరిగింది.ఈరోజు వారి కుటుంబాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విష్ణువర్ధన్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా హుజురాబాద్ డివిజన్ పరిధిలో పాత్రికేయ రంగంలో పనిచేసి అనేక రకాల ప్రజా సమస్యలను వెలికి తీసి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి, ప్రజల పక్షాన నిలబడే వారని కొనియాడారు. వారి మృతి పత్రిక రంగానికి,ఈ ప్రాంత ప్రజలకు తీరని లోటు ఆని అన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు మనో ధైర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన వెంట నాయకులు దేశిని కోటి, సుంకరి రమేష్, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, సాయిని రవి, సజ్జు, రామారావు, సలీం, గూడెపు సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking