కార్వాన్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మిత్రకృష్ణ
హైద్రాబాద్ సెప్టెంబర్ 4. సొంతిళ్లు లేని నిరుపేద కుటుంబాలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించిన చరిత్ర యావత్తు ప్రపంచంలోనే ఎక్కడా ఏ దేశ ప్రభుత్వంలో లేదని, కానీ ఆ అరుదైన కానుకను తెలంగాణ ప్రజలకు ఉచితంగా అందజేసిన ఘనచరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని కార్వాన్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏ కృష్ణయ్య అలియాస్ మిత్రకృష్ణ అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినమాటకు కట్టుబడి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పేద ప్రజలు తమ జీవితాలను మరింత మెరుగుపర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్వాన్ నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు పటాన్చెరు మండలం కొల్లూరు, ఆమీన్ పూర్లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లకు సంబంధించిన పట్టాలను రాష్ట్ర మంత్రి హరీషారావుతో కలిసి ఎ.కృష్ణయ్య (మిత్రకృష్ణ)లు కలిసి లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా మిత్రకృష్ణ మాట్లాడుతూ రెండు పడక గదుల ఇళ్ళు పొందిన ప్రతీ కుటుంబానికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకుగా అందజేస్తుందని అన్నారు. తొలిరోజు కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించామని, డ్రాలో పేరు ఎల్లని దరఖాస్తుదారులకు మరో వారం పది రోజుల్లో మళ్లీ ఆన్లైన్ డ్రా నిర్వహించి మరికొందరికి రెండవ విడతలో ఇళ్లను అందజేస్తామని, ఇలా దశల వారీగా దరఖాస్తుదారులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేసేందుకు సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్లు కట్టుబడి ఉన్నారని, ఈ విషయంలో మిగతా దరఖాస్తుదారులు బించించాల్సిన పనిలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.