వనదుర్గ భవాని అమ్మవారి జాతర సందర్భంగా ప్రజావాణి కార్యక్రమం రద్దు

ఈ రోజు మెదక్‌ జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్‌.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్‌ గారు మాట్లాడుతూ…. ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి జాతర సందర్భంగా సోమవారం నిర్వహించవలసిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశామని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుండి 20 వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించే జాతరకు జిల్లా పోలీస్‌ అధికారులందరూ నిమగ్నమై ఉన్నందున ఈ నెల తేదీ:20.02.2023 నాడు నిర్వహించవలసిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. జాతర అనంతరం ఈనెల 27 నుండి ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని ప్రజలు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking