ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి

 

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి మే 1:
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరంలోనిర్వహించిన ప్రజావాణిలో భాగంగా జిల్లా లో వివిధ సమస్యల పై పిర్యాదులను సమర్పించడానికి వచ్చిన ప్రజల నుండి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి , జిల్లా రెవెన్యూ అధికారి లింగ్య నాయక్, తో కలిసి 32 దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన దరఖాస్తులను నిబంధనల మేరకు పరిష్కరించాలని ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్ లో పెట్టకూడదన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు వాటినివెంటనే పరిష్కారించాల్సిందిగా ఆదేశించారు .
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking