ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి 22 : జిల్లాలో గుర్తించిన ఇసుక రీచ్లకు అదనంగా 5 రీచ్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కొరకు ప్రతిపాదనలు సమర్పించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్తో కలిసి భూగర్భ గనుల శాఖ, భూగర్భ జల,పంచాయతీ, నీటిపారుదల,గ్రామీణ నీటి సరఫరా,కాలుష్య నియంత్రణ శాఖ- నిజామాబాద్ పర్యావరణ ఇంజనీరింగ్ విభాగం,టి.జి.ఎం.డి.సి., రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా 5 ఇసుక రీచ్ల ఏర్పాటుకు పర్యావరణ అనుమతుల కొరకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు.జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్ల,వేంపల్లి బ్లాక్-1, 2, నస్పూర్ మండలం తాళ్ళపల్లి, జైపూర్ మండలం ఇందారం ప్రాంతాలలో రీచ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని,పర్యావరణ అనుమతుల కొరకు సమర్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి,జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.