రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన

 

ఈనెల 18న శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి శీతాకాల విడిది ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ గౌతమ్ సమీక్ష

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికై ఈనెల 18, న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయా శాఖల అధికారులు వారికి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో డిసిపి శబరీష్ , అదనపు కలెక్టర్ విజయంద్ర రెడ్డి తో కలిసి జిల్లాలోని ఆయా శాఖల అధికారులతో మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముందస్తు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ఈనెల 18,న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికి హైదరాబాద్ కి రానున్నారని తెలిపారు. రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో జిల్లాలోని హకీంపేట ఎయిర్పోర్టుకు ముందుగా చేరుకొంటారని అక్కడ నుంచి బొల్లారంకు రోడ్డు మార్గం ద్వారా వెళ్తారని కలెక్టర్ అధికారులకు వివరించారు. ఈ నేపథ్యంలో హకీంపేట ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి రాక సందర్భంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి శీతాకాల విడిదికి వస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని అలాగే తిరిగి వెళ్ళే వరకు అప్రమత్తంగా ఉండాలని సమీక్ష సమావేశంలో కలెక్టర్ గౌతమ్, అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో డిసిపి శబరీష్ , జిల్లా అదనపు కలెక్టర్ విజయంద్ర రెడ్డి, తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, ఆర్డీవోలు రాజేష్ కుమార్ శ్యామ్ ప్రకాశ్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking