శ్రీశైలం బ్యాక్ వాటర్ తరలింపును అడ్డుకోండి

-ప్రభుత్వానికి సామాజికవేత్త అశోక్ కుమార్ విజ్ఞప్తి

గుట్టు చప్పుడు కాకుండా తరలిపోతున్న శ్రీశైలం బ్యాక్ వాటర్ ను కాపాడాలని ప్రభుత్వానికి సామాజికవేత్త అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఏర్పాటు చేసిన విద్యుత్ సంస్థ అనధికారికంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ ను తరలించకుపోతున్నట్లు తమ క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించినట్లు తెలిపారు. సదరు సంస్థ సూర్యరశ్మి లేని సమయంలో నీటి ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకే భారీ కాలువలను ఏర్పాటు చేసి పెద్ద పెద్ద ఎత్తున నీటిని తరలించకపోతుందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు ముఖ్య నీటి వనరు అయిన శ్రీశైలం జలాలను అక్రమంగా తరలించుకు పోతుంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విస్మయాన్ని కలిగిస్తుందని అన్నారు. ఈ అక్రమ తరలింపు తో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. గత ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఇప్పటికైనా రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఈ అక్రమ తరలింపును అడ్డుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking