క్షయ వ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

 

జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్

జగిత్యాల, ఫిబ్రవరి 24(ప్రజాబలం ప్రతినిధి)
క్షయ నివారణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి
నివారణకు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని మోతెవాడ అర్బన్ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం నిక్షయ్ దివాస్ కార్యక్రమంలో
భాగంగా క్షయ వ్యాధి నివారణ చర్యలపై అవగాహన
కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షయ నివారణ కై
సిబ్బందిచే ప్రతిజ్ఞ నిర్వహించారు.
దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం లాంటి
లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాలలో ఉచిత నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్షయ
నిర్ధారణ జరిగితే ఉచితంగా ఆరు మాసాల పాటు మందులు
అందజేయడంతో పాటు ప్రతినెల పోషణ భత్యం కింద రూ.500 అందజేస్తున్నామని అన్నారు. క్షయ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయడం, మందులు వాడటంతో ఇతరులకు వ్యాధి సోకదని అన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులు దగ్గు లేదా తుమ్మినప్పుడు నోటికి మాస్క్ లేదా మోచేతిని అడ్డుపెట్టుకోవాలని తద్వారా ఇతరులకు సోకే ప్రమాదం
తప్పుతుందన్నారు. జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రతినెల ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సహంతోపాటు దాతల సాయంతో నిక్షయ మిత్ర పథకం ద్వారా పోషకాహార కిట్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు.. క్షయ
వ్యాధిగ్రస్తులకు పోషకాహారం అందించే నిక్షయ మిత్ర లో
దాతలు స్వచ్ఛందంగా పాల్గొని చేయూత అందించాలని
కోరారు. క్షయ వ్యాధి నిర్ధారణకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అధునాతన యంత్రం అందుబాటులో ఉందని తేమడ
పరీక్షలతో క్షయ నిర్ధారణ సులభమని అన్నారు. లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ యం. గీతిక, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్లు శ్రీనివాస్, మహేష్, జిల్లా లెప్రసీ ప్రోగ్రాం అధికారిని రూప, సృజన్, దివ్య ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking