రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున వంజరుల నిరసనలు.

దాదా ఇదాయతే కమీషన్‌ సిఫారసుపై నీళ్లు చల్లిన రాష్ట్ర ప్రభుత్వం.
వంజరులను పూర్వపు ఎస్టీ సంచార జాతి తెగలో పునరుద్దరించాలని డిమాండ్‌.
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కలెక్టర్‌, తహసీల్దార్‌ లకు వినతి పత్రాల సమర్పణ.
హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: ఫిబ్రవరి 23న తెలంగాణ వంజరులకు చీకటిదినంగా పరిగణించి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ పూర్వపు జీవో 245 తేదీ 30.06.1977 ఆధారంగా వారిని ఎస్టీ సంచారజాతికి చెందిన సుగాలి తెగలో కలపాలని స్థానిక జిల్లా కలెక్టర్లకు,మండల కేంద్రాల్లో తహశీల్దార్లకు అఖిల భారత వంజరి సేవా సంఘం తెలంగాణ కమిటి మాజి జనరల్‌ సెక్రటరి వెంకట్‌ రమణ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వంజ రులు నిరసనలు తెలుపు తూ వారు వారు నివసించే వారి వారి జిల్లా,మండల కేంద్రాల్లో కలెక్టర్లకు,తహశీల్దార్ల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా వినతిపత్రాలను సమర్పించి ఉవ్వె త్తున నిరసనలు తెలియ జేశారు.


వివరాల్లోకి వెళితే గతంలో వంజరులు అనే జాతి ఎస్టీ సంచార జాతి సుగాలి తెగనుండి వచ్చిన వన – చరులు అనే పదం నుండి వనచరులు, వంజ రు లుగా పరిణామం చెందగా వంజరులు అడవి ఉత్పత్తుల రవాణాపై, మారు బ్యారం(వస్తువు మార్పిడి ), ఎక్కడికక్కడ ప్రజలకు అవసరమయ్యే ఉత్పత్తిలో కూలీలు గా, హమాలీ, రైతు కూలి పనులపై ఆధారపడుతూ కులానికి ప్రత్యేక గుర్తింపు వృత్తి లేని వంజరి సామాజిక వర్గ ప్రజలు పరిణామంలో వలస జీవులుగా వన చరులు అనే షెడ్యూలు కులాల సంచార జాతి క్రమక్రమంగా వంజరులుగా దేశంలోని రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌,గుజరాత్‌,ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర,ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు మనుగడకు సంచార వంజరులు విస్తరించారు అయితే మహారాష్ట్ర సహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వీరు ఎస్టీ సంచార తెగ సుగాలి లో కొనసాగుతుండగా వారి సాంస్కృతిక, ఆర్థిక,సామాజిక జీవన స్థితిగతుల ఆధారంగా 1977 లో జీవో 245 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో కూడా ఎస్టీ సంచారజాతి సుగాలిలో కొనసాగుతుండగా అనతికాలంలోనే ఇక్కడి అప్పటి ప్రభుత్వాలు జీవో నంబర్‌ 44 తేదీ 23 ఫిబ్రవరి1979 న ఎలాంటి సమాచారం లేకుండా వారిని వెనకబడిన తరగతులు బీసీ ‘‘డి’’ క్రమసంఖ్య 32 లో చేర్చారు. అప్పటినుండి తమ సామాజికవర్గం వెనుకబాటుతనం మొస్తోందని అనేకసార్లు వంజరి రిజర్వేషన్‌ రిసాల్వేషన్‌ కమిటీ నాయకత్వం ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేసినా ఫలితం రాకపోవడంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఎస్టీ హక్కుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన దాదా ఇదాయత్‌ కమీషన్‌ ను ఆశ్రయించారు. విచారించిన దాదా ఇదాయత్‌ కమిషన్‌ ఈ సమస్యను తేల్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపిన నేపద్యంలో తెలంగాణ ప్రభుత్వం వంజరులు కోల్పోయిన హక్కుల పట్ల అనుకూలంగా రిపోర్ట్‌ ఇస్తుందని కోల్పోయిన వంజరుల హక్కులు సాకారం అవుతాయని ఆశాభావంతో ఆసామాజిక ప్రజలు వేచి చూసినా కానీ తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా వారి ఆశలపై నీళ్లు చల్లింది అయినా వంజరి సామాజిక ప్రజలు తమ హక్కులను సాధించుకొనే వరకు వెనక్కి తగ్గేది లేదని ప్రతి ఫిబ్రవరి 23 తేదీ ని బ్లాక్‌ డే గా పరిగణలోకి తీసుకొని నిరసనలు తెలుపుతూ సంబంధిత అధికా రుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వంజరులు చేస్తున్న న్యాయ బద్ధమైన, న్యాయసమ్మతమైన వారి డిమాండ్ల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.


రాష్ట్ర వ్యాప్తంగా పాకిన వంజరుల నిరసనలు
హైదరాబాద్‌ రంగారెడ్డి జిల్లా లోని మేడ్చల్‌ లో వంజరి సామజిక ప్రజలు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి బ్లాక్‌ డే నిరసన తెలియజేస్తూ వంజరులను పూర్వపు రిజర్వేషన్‌ కోటా లోని ఎస్టీ సుగాలి సంచార తెగలో పునరుద్దరించాలనే డిమాండ్‌ చేస్తూ మేడ్చల్‌ వంజరి సంఘం అధ్యక్షులు మైసరి పరమేశ్వర్‌ వంజరి, ప్రధాన కార్యదర్శి ఎదుగని శ్రీనివాస్‌ వంజరి ఆధ్వర్యంలో పెద్దఎత్తున వంజరులు మండల తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలియజేస్తూ వినతిపత్రం సమర్పించారు.
నిజామాబాద్‌ జిల్లా కేంద్రం లో..
నిజామాబాద్‌ జిల్లా కేంద్రం లోని వంజరి వాడ లోగల వంజరి సంఘం భవన ఆవరణలో అఖిల భారతీయ వంజరి సేవా సంఫ్‌ు, తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కరిపె రాజు వంజరి ఆధ్వర్యంలో నిజామాబాద్‌ పట్టణ వంజరి సంఘం సభ్యులు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలియజేసారు. వంజరులను ఎస్టీ సుగాలి సంచార జాతి తెగలో కలపాలని నినదించారు.
జగిత్యాల జిల్లా లో కలెక్టర్‌ కు వినతి పత్రం సమర్పించిన వంజరులు.
జగిత్యాల పట్టణంలో మూడు వార్డుల్లో మెజారిటీ గా నివసిస్తున్న వంజరులు తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం జాయింట్‌ సెక్రెటరీ ఆరె శంకర్‌ రావుజీ వంజరి, పట్టణ సంఘాల అధ్యక్షులు పోతునుక మహేష్‌ వంజరి, నవ్వొతు ఆంజనేయులు ఆధ్వర్యంలో వంజరి సంఘాల నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ వంజరు లను పూర్వపు ఎస్టీ సంచార జాతి సుగాలి తెగలో పునరుద్దరిం చాలని ఈమేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా కు వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో లవంగ పెద్ద శ్రీనివాస్‌,ఆరె శంకర్‌, పోతునుక మహేశ్‌, బానుకా భాస్కర్‌, పాపన్క శ్రీనివాస్‌ ,లవంగ శ్రీనివాస్‌,బోదుకని రాజన్న, ముల్లె లింబద్రి, కొండేరి రాము, నవత్‌ రాజ్‌ కుమార్‌, బానుక రాజేశం, కాలేరు వెంకటేష్‌, కొండేరు దాసు,బడంగు శంకర్‌ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


మెట్‌ పల్లి మండల కేంద్రం లో వంజరుల నిరసన..
జగిత్యాల జిల్లా మెట్‌ పల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం డైరెక్టర్‌, జిల్లా వంజరి సంఘం అధ్యక్షులు బొమ్మెల శంకర్‌ ఆధ్వర్యంలో వంజరులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈమేరకు మండల తహసీల్దార్‌ కు వినతి పత్రం సమర్పించారు.ఈకార్యక్రమంలో మెట్‌ పల్లి పట్టణ వంజరి సంఘం నాయకులు దర్మేందర్‌, నల్ల వెంకటేశ్వర్లు, నవాతు రాజేందర్‌, బోదుకం శేఖర్‌, లక్ష్మీపతి, సురేష్‌ ఆత్మ కూర్‌, అమ్మక్కపేట, సత్తక్కపల్లి గ్రామ వంజరి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking