ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 8:
ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డి ఆర్ ఓ హరిప్రియ తో కలిసి జిల్లా కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు.
ప్రజావాణి కార్యక్రమంలో (124) దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.అనంతరం జిల్లా అధికారుల తో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో వనమహోత్సవం క్రింద అధికారులు వారికి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటడానికి పూర్తి చేయాలన్నారు. రూరల్, గ్రామపంచాయతీలలో మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వర్షాలు కురుస్తున్నందున మొక్కలు నాటే కార్యక్రమం అధికారులు చేపట్టాలన్నారు.జిల్లా కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని త్వరలో అమలు చేస్తున్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking