ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి 24 ఏప్రిల్ 2023:సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, తో పాటు సి పి ఓ మోహనరావు లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, మాట్లాడుతూ అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారుల కు సూచించినారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking