ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్య

నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన
జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి
కరీంనగర్‌ ప్రజాబలం ప్రతినిధి  కరీంనగర్‌ప్రభుత్వ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్య అందుతోందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు.కరీంనగర్‌ లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటుచేసిన సోషల్‌ సైన్స్‌ ప్రదర్శనశాలను కలెక్టర్‌ ప్రారంభించారు.అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన ఫెరియో ఫెస్టా, కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో 2700 మంది విద్యార్థినిలు అభ్యసించడం గొప్ప విషయం అన్నారు. వీరంతా విజయం సాధించి వివిధ రంగాల్లో స్థిరపడాలని, తోటి మహిళలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఆర్థికంగా బాగుంటేనే మంచి చదువు చదవగలమని భావనను విడనాడాలని అన్నారు. ప్రభుత్వ రంగంలో అన్ని రకాల సౌకర్యాలతో కూడిన విద్య అందుబాటులో ఉందన్నారు. జిల్లా యంత్రాంగం తరపున కళాశాలకు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఇంటర్‌ విద్యార్థులు ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణాన్ని సందర్శించేలా చూడాలని బాలికల అభివృద్ధి అధికారి కృపారాణిని ఆదేశించారు.
అనంతరం కళాశాలలో డిపార్ట్మెంట్‌ వారీగా ఏర్పాటు చేసిన తరగతి గదులను, ఎగ్జిబిషన్‌ ను పరిశీలించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శన ఆకట్టుకుంది. ఎన్‌. సి.సి విద్యార్థులు కలెక్టర్‌ కు గౌరవ వందనం చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, ప్రిన్సిపాల్‌ టీ.భాగ్యలక్ష్మి, ఎన్సిసి డాక్టర్‌ లెఫ్టినెంట్‌ ఆయేషా షేక్‌, అధ్యాపకులు, వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking