విద్యార్థుల ప్రతిభను వెలికి తీసే క్విజ్ పోటీలు

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 7:
తార్నాక నారాయణ ఈ టెక్నో పాఠశాలలో స్పెల్ బీ క్విజ్ లు నిర్వహించారు. ఈ క్విజ్ లో 2000 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో 24 మంది
విద్యార్థులు ఫైనల్ కి చేరుకున్నారు. విద్యార్థులు వారి యొక్క ప్రతిభను, మేధాశక్తిని ప్రదర్శించి అందరిని ఆశ్చర్యపరిచేలా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జీఎం గోపాల్ రెడ్డి, ఎ.జి.యం, బాలపరమేశ్వర్ హాజరయ్యారు.
మాట్లాడుతూ విద్యార్థులు పదాలలోని ఉచ్ఛారణ పద్దతి,
పదాలలో ఎలాంటి అక్షర దోషాలు లేకుండా రెప్పపాటు సమయంలో ఎంతో
ఉన్నతంగా ఆలోచిస్తూ ఒకరిని మించి ఒకరు వారి యొక్క ప్రతిభను చాటుతున్నారు అని వారిని ప్రశంసించారు. విద్యార్థులలో సజనాత్మక వెలికి తీసేందుకు దోహదపడే క్విజ్‌ విజ్‌, సైన్స్‌ క్విజ్‌, స్పెల్‌ బి మన్‌ వంటి విభాగాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమం లో హైస్కూల్
హెడ్. శివరంజని, తెలంగాణ హెడ్ పదవ తరగతి ఇంచార్జ్
ముంతాజ్, ఈ- చాంప్స్ అర్ అండ్ డీ హెడ్ మహేశ్వరి, హైస్కూల్ కో- ఆర్డినేటర్ ఆజాద్, ఈ చాంప్స్ కో-ఆర్డినేటర్ లక్ష్మీ భవాని,
ఈ – కిడ్స్ కో- ఆర్డినేటర్ నూర్, ఉప్పల్ ప్రిన్సిపాల్, వాణి,
డి.డి.కాలని, ప్రిన్సిపాల్. సవిత, రామంతాపూర్ ప్రిన్సిపాల్. సరిత, నారాయణ గూడ ప్రిన్సిపాల్ అర్నిత్ కౌర్, చార్మినార్ ప్రిన్సిపాల్, శారద.
తార్నాక ప్రిన్సిపాల్ పర్వీన్, హైస్కూల్ ఏ.డి. సురేష్, ఎ.ఓ. మహేందర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking