గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదు.బీజేపీ అభ్యర్థి ని సస్పెన్షన్ ఎత్తివేసి గోషామహల్ సిట్టీంగ్ ఎమ్మెల్యే టీ.రాజాసింగ్ ప్రకటించడం జరిగినది.రాజాసింగ్ బుధవారంనాడు గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గన్‌ఫౌండ్రీ మున్సిపల్ డివిజన్ పాదాయాత్ర మొదలుపెట్టారు.గన్‌ఫౌండ్రీ డివిజన్‌లోని గుజరాతి గల్లీ హనుమాన్ టేక్‌డీ సుల్తాన్ బజార్ మొదలగు ప్రాంతాలలో పాదాయాత్ర చేస్తూ ఇంటింటికి ఓట్లు కోరడం జరిగినది.ఇక్కడి ఏరియాలోని షాఫ్‌లోకి వెళ్ళికూడా ఓట్లు అభ్యర్థించడం జరిగినది. ఈ సందర్భంగా పాదాయాత్రకు విచ్ఛేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బస్తీ వాసులు స్వాగతం పలుకుతూ శాలువాతో సన్మానించడం జరిగినది.ఈ కార్యక్రమంలో గన్‌షౌండ్రీ మున్సిపల్ డివిజన్ కార్పోరేటర్ డా॥ సురేఖా ఓంప్రకాష్ గన్‌షౌండ్రీ మున్సిపల్ డివిజన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.
