శ్రీనగర్‌ రెజోనెన్స్‌ లో  రాఖీ  వేడుకలు

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 19 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ స్థానిక శ్రీనగర్‌ కాలనీలో గల రెజోనెన్స్‌ స్కూల్‌లో రాఖీ పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు రెజోనెన్స్‌ స్కూల్‌ శ్రీనగర్‌లో రక్షాబంధన్‌ వేడుకలలో విద్యార్థినులు విద్యార్థులకు రాఖీలను కట్టి వారందరు వారి లక్ష్యాలను, విజయాలను సాధించాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ వేడుకలను ఘనంగా నిర్వహించారు పాఠశాల డైరెక్టర్‌ కొండా శ్రీధర్‌ రావు ఈ కార్యక్రమంలో పాల్గోని, మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న భారతీయ సాంప్రదాయం లోని రాఖీ పండుగ విశిష్టతను తెలియజేస్తూ రాఖీ(రక్షా) అనగా రక్షణ, బంధన్‌ అనగా సూత్రం అని అక్కా, చెళ్ళెలు తమ సోదరులు చేసే ప్రతి మంచి పనిలో విజయాలను సాధించాలని నుదుటన తిలకం దిద్ది చేతికి రక్షాబంధన్‌ కట్టి హారతి ఇచ్చి, ఆశీర్వాదం తీసుకుంటారని సోదరులు తమ అక్కా, చెళ్ళెలకు ఎల్లప్పుడు మీకు నేను రక్షణగా ఉంటానని ఆశీర్వదించి, మంచి బహుమతులను అందజేస్తారని రెజోనెన్స్‌ స్కూల్‌ శ్రీనగర్‌లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మన సంస్కృతి సంప్రాదాయా లను వారి జీవితంలో ఒక భాగంగా పెంపొందిస్తామని తెలియజేస్తూ అందరికి రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలియజేసారు రాఖీ పండగను పురస్కరించుకొని విద్యార్థినులందరూ రాఖీలను తెచ్చి సోదర సమానులైన తమ స్నేహితులకు రాఖీలను కట్టి తమకు రక్షణగా ఉండాలని ఆకాంక్షిస్తూ వారు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఎంతో ఉత్సాహంగా కేరింతలతో గురువుల మధ్యన ఈ రాఖీ వేడుకలలో పాల్గొని అందరిని ఆనందింపజేసి రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‌ కొండా కృష్ణవేణి ప్రిన్సిపాల్‌ మరియు బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking