పారిశ్రామిక ఖిల్లాగా రంగారెడ్డి జిల్లా

 

కేటీఆర్ కృషి తో ప్రపంచ చిత్రపటంలో రంగారెడ్డి జిల్లా ఉనికి
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో 6 లక్షల ఎకరాలకు ఉమ్మడి జిల్లాలో సాగునీరు
ఉనికి కాపాడుకోవడం కోసం ప్రతిపక్షాల తపన…. మరోసారి సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించండి..

40 కోట్లతో షాబాద్ మండలం సర్వముఖాభివృద్ధి
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి.

గతంలో అతి గతి లేని తెలంగాణ రాష్ట్రo, రంగారెడ్డి జిల్లా నేడు పారిశ్రామిక జిల్లాగా మారిందని, దేశానికి ఆదర్శవంతమై నిలుస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
షాబాద్ మండలంలోని హైతాబాద్, మచనపల్లి, మల్లారెడ్డి గూడా గ్రామాల పరిధిలో 8 కోట్ల 65 లక్షల నిధులతో ఎమ్మెల్యే కాలే యాదయ్య, జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి, ఎంపీపీ ప్రశాంతి మహేందర్రెడ్డి తదితరులతో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గతంలో పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన ప్రాంతాలకు నిలయంగా మారిందని చెప్పారు.


తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశానికే దిశ దశ చూయించే విధంగా అభివృద్ధి పథంలో అన్ని రంగాలలో ముందుకు సాగుతుందని అన్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల, షాబాద్ పారిశ్రామిక వాడ లు ప్రపంచ చిత్రపటంలో నిలుస్తుందని అన్నారు.
హైదరాబాద్ విశ్వ నగరంగా ఉనికిని చాటుకుంటే పరిసర ప్రాంతాల్లో పల్లెలు హైదరాబాద్ నగరానికి సమాంతరంగా మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని మహేందర్రెడ్డి వివరించారు.
ఐటీ ,భారీ పరిశ్రమలతో పాటు విద్య, వైద్యం లాంటిది ఎంతో పేద ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు.


సీఎం అల్పాహార పథకం పేద విద్యార్థులకు పాలిట ఒక వరంగా మారుతుందని ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతి విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం సన్నబియ్యంతో అందిస్తున్నామని మహేందర్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలు ఈ పథకాలతో దిమ్మదిరిగి తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించి సీఎంగా కేసీఆర్ను మూడోసారి ఆశీర్వదించాలని మహేందర్రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking