ప్రతి అంశాన్ని చదివి అర్థం చేసుకొని అవగాహన పెంచుకోవాలి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 16 : ప్రభుత్వ ఉద్యోగుల సాధనలో పోటీ పరీక్షలు కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ప్రతి అంశాన్ని చదివి అర్థం చేసుకొని,అవగాహన, పెంచుకోవాలని,జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయ భవన సమావేశ మందిరంలో పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఏ.కె.ఎల్, ఐ.ఏఎల్,అకాడమీ- హైదరాబాద్ ద్వారా అవగాహన, నమూనా,మాదిరి పరీక్షల నిర్వహణపై నిర్వహించే సదస్కు జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు జిల్లా గ్రంధాలయ సంస్థ పర్సల్ ఇంచార్జ్ బి. రాహుల్,తెలుగు విశ్వ విద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసన్, అకాడమీ ప్రతినిధి హర్షలతో కలిగి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ గ్రూపుల పరీక్షలు,డి.ఎస్.సి ఇతర ఉద్యోగులకు సంబంధిత పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఏకాగ్రత పట్టుదలతో చదవాలని,సివిల్ సర్వీస్ పరీక్షల వివిధ విధానాలు,చదవడంలో అవలంబించే మెళకువలను పాటిస్తూ సిద్ధం కావాలని, ఇందు కొరకు అభ్యర్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు జిల్లా యంత్రాంగం తరుపున కల్పించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.ఈ క్రమం లోఎ.కె.ఎస్,ఐ.ఎ.ఎస్, అకాడమీకి-హైదరాబాద్ ద్వారా అందిస్తున్న ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని, నమూనా,మాదిరి పరీక్షలకు హాజరై పరీక్ష విధానాన్ని తెలుసుకొని ఉద్యోగులు సాధించాలని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…జిల్లాలోని గ్రంథాలయం,శాఖ గ్రంధాలయ లలో పోటీ పక్షులకు సన్నదమయ్యే అభ్యర్థుల కొరకు పత్రికలు, పుస్తకాలు, మెటీరియల్ ను, అందుబాటులో ఉంచడం జరిగిందని అభ్యర్థులకు కావలసిన అవసరాలను తమ దృష్టికి తీసుకొచ్చినట్లయితే, పరిష్కరించే విషయంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అకాడమీ ప్రతినిధి మాట్లాడుతూ…నిరుద్యోగ అభ్యర్థులను ప్రోత్సహిస్తూ అకాడమీ,తరపున నమూనా,మాదిరి పరీక్షలకు అవసరమైన విషయాలను అందుబాటులో ఉంచడం జరిగింది అని తెలిపారు. అనంతరం అకాడమీ ద్వారా గ్రూప్ పరీక్షల సిలబస్ ప్రత్తులను, నమూనా పరీక్ష పత్రాలను అభ్యర్థులకు అందజేశారు. తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ మాట్లాడుతూ…అకాడమీ లో చరిత్ర బోధకులు పోటీ పరీక్షలకు ప్రతి విషయాన్ని క్షుణంగా వివరిస్తూ చదివే విధానం కార్యచరణ తెలుసుకోవడంతో పాటు నమూనా పోటీ పరీక్షలు రాయవలసిన అవసరం పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎ.వి.ఎస్ రాజు,గ్రంథ పాలకులు ఎస్.మురళి,సిబ్బంది కృతిన్,సంపత్,చక్రవర్తి జిల్లా గ్రంధాలయం,శాఖ సిబ్బంది. అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking